హైదరాబాద్: 28°C
తెలంగాణ

మర్పల్లి తండాలో యువకుడి మిస్సింగ్‌

VKB: మర్పల్లి మండలం ధమాస్తపూర్ తండాకు చెందిన బాణావత్ చరణ్ (22) కనిపించకుండా పోయాడు. శ్రీనివాస్ కుమారుడైన చరణ్ వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. నవంబర్ 18న మధ్యాహ్నం 12:30 గంటల నుంచి అతడి ఆచూకీ తెలియడం లేదు. ఎక్కడైనా కనిపిస్తే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరారు.