హైదరాబాద్: 28°C
తెలంగాణ

రీ సర్వే తో ప్రభుత్వ భూముల గుర్తింపు

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించేందుకే భూముల రీ సర్వే చేస్తున్నామని స్థానిక తహసీల్దార్ బక్కయ్య తెలిపారు. గురువారం మధ్యాహ్నం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 29 గ్రామ పంచాయతీల పరిధిలో భూముల రీ సర్వే జరుగుతుందని తెలిపారు. ఆ సర్వేకు అందరూ సహకరించాలని తెలిపారు.