హైదరాబాద్: 28°C
తెలంగాణ

గర్భిణుల హైరిస్క్ కేసుల గుర్తింపుపై పర్యవేక్షణ

KMR: గర్భిణుల్లో హైరిస్క్ కేసుల గుర్తింపు, వైద్య సేవల అమలును పరిశీలించేందుకు హైదరాబాద్‌కు చెందిన ARMMAN బృందం భిక్నూర్ PHC‌తో పాటు బస్వాపూర్ సబ్‌సెంటర్లను సందర్శించింది. గర్భిణుల రికార్డులు, వైద్య పరికరాలు, మందుల నిల్వలను తనిఖీ చేసి సిబ్బందికి పలు ప్రశ్నలు వేసి వివరాలు సేకరించింది. వైద్య సేవల నిర్వహణపై బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.