హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాల్య వివాహ రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్లను తీర్చిదిద్దాలి'

SRCL: బాల్య వివాహాల నివారణకు ప్రజలందరూ భాగస్వాములై గ్రామాల్లో చైతన్యం తీసుకురావాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన, కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో ఏడాది కాలంగా బాల్య వివాహాలు జరగకపోవడంతో గురువారం బాల్య వివాహ రహిత గ్రామంగా ప్రకటించారు.