హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవులపల్లిలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

SRD: హత్నూర మండలంలోని దేవులపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్ చేసిన కృషిని స్మరించుకున్నారు. రాజ్యాంగ విలువలు, హక్కులపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.