VKB: మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో పరిగి మున్సిపాలిటీలోని 13వ వార్డు ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన స్థానిక కౌన్సిలర్ మీర్ సమీనా తాహేర్ అలీ గురువారం స్పందించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ సహకారంతో ప్రత్యేకంగా నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేయించి కాలనీవాసులకు తాగునీరు అందించారు. దీంతో ప్రజలకు తాత్కాలికంగా నీటి కష్టాలు తీరాయి.
తెలంగాణ
మిషన్ భగీరథ నిలిచినా.. ట్యాంకర్లతో నీరు


