హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంట మాటున అక్రమంగా గంజాయి సాగు

NRML: పత్తి పంట మాటున అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని మామడ పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్ర గ్రామ పరిధిలోని ధన్జీనాయక్ తండా శివారులో కున్సోత్ రవి తన పొలంలో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల తనిఖీల్లో 204 పచ్చి గంజాయి మొక్కలు, 54 ఎండిన మొక్కలు, 5.320 కిలోల ఎండిన గంజాయి ఆకులను స్వాధీనం చేసుకున్నారు.