హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగునీటి సాధన కమిటీ ఛైర్మన్ అరెస్ట్

NGKL: సీఎం రేవంత్ రెడ్డి అచ్చంపేట పర్యటన నేపథ్యంలో అమ్రాబాద్ సాగునీటి సాధన కమిటీ ఛైర్మన్ కల్ముల నాసరయ్యను పోలీసులు గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. అమ్రాబాద్‌కు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూన్న ఆయన సభకు ఆటంకం కలిగిస్తారనే సమాచారంతో ముందస్తుగా అరెస్టు చేసి నిర్బంధించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాసరయ్య నినాదాలు చేశారు.