JGL: రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని వల్లంపల్లి పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు రమేశ్ రెడ్డి అన్నారు. భీమారం మండలంలోని మన్నెగూడెం, లింగంపేట గ్రామాల్లో వల్లంపల్లి పీఎస్ఏస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'


