హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైనేజీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

HYD: బహదూర్‌పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ కుంట డివిజన్‌లో రూ.46 లక్షల వ్యయంతో చేపట్టిన NP3 పైప్‌లైన్ పనులను పరిశీలించారు. వట్టేపల్లి మందిరం నుంచి నైస్ హోటల్ వరకు జరుగుతున్న పనులను అధికారులతో కలిసి తనిఖీ చేశారు. డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.