హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి'

MNCL: బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు బాలికలపై జరిగే లైంగిక వేధింపుల నివారణకు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని లక్ష్మక్కపేట జూనియర్ సివిల్ జడ్జి కృష్ణ అన్నారు. గురువారం స్థానిక బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. బాల్య వివాహాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.