హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డులపై సర్పంచ్ ఆవేదన

RR: నందిగామ మండల సమావేశంలో అంతిరెడ్డిగూడ సర్పంచ్ మంజుల ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామ అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇతర గ్రామాలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసినప్పటికీ తమ గ్రామానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాజకీయ కారణాలతో అభివృద్ధిని అడ్డుకోవద్దని, అర్హులైన పేదలకు వెంటనే అందించి న్యాయం చేయాలని కోరారు.