HYD: AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే మొహియుద్దీన్ నాందేడ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఫేమస్ ఫంక్షన్ హాల్లో పార్టీ జిల్లా, నగర కమిటీలను ప్రకటించారు. స్థానిక నాయకులతో చర్చలు, సంప్రదింపులు జరిపిన అనంతరం కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా, నగరవ్యాప్తంగా పార్టీ సంస్థాగత బలోపేతం, విస్తరణే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
నాందేడ్‌లో AIMIM కమిటీలు ప్రకటన


