హైదరాబాద్: 28°C
తెలంగాణ

NITలో మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభం

WGL: నీట్ వరంగల్‌లో గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో 5వ అంతర్జాతీయ భద్రత, గోప్యత సదస్సు (ICSP-2026) గురువారం ప్రారంభమైంది. ఈ నెల 28 వరకు జరిగే సదస్సులో దేశ, విదేశాలకు చెందిన నిపుణులు సైబర్ భద్రత, క్రిప్టోగ్రఫీ, డేటా గోప్యత అంశాలపై చర్చించనున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ సౌరవ్ ముఖోపాధ్యాయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సదస్సుకు ANRF సహకారం అందిస్తోంది.