HYD: ఓయూలో వచ్చే వారం నిర్వహించనున్న పీజీ విద్యార్థుల పరిచయ కార్యక్రమం 'దీక్షారంభ్'కు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు వీసీ ప్రొఫెసర్ కుమార్ డీజీపీని కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు. మరో ఐపీఎస్ అధికారి, ఓయూ పూర్వ విద్యార్థి డాక్టర్ మహేశ్ భగవత్‌ను కూడా ఆహ్వానించారు. కార్యక్రమంలో విద్యార్థులకు ఉన్నతాధికారులు మార్గనిర్దేశం చేయనున్నారు.
తెలంగాణ
ఓయూకు రానున్న పోలీస్ బాస్


