హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల్య వివాహాల నివారణకు 100 రోజుల ప్రచారం

KMR: బాల్య వివాహాల నిర్మూలనకు చేపట్టిన 100 రోజుల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగవాన్ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. బాల్య వివాహాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాంటి ఘటనలు తెలిస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని సూచించారు. బాలల హక్కుల పరిరక్షణకు అందరూ సహకరించాలని కోరారు.