హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీపీ, డీసీపీకి హైకోర్టు షాక్

MDCL: హైకోర్టు ఉత్తర్వులను నిర్లక్ష్యం చేసినందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. కమిషనర్‌కు రెండు వారాల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది. అయితే శిక్ష అమలును వారం రోజులపాటు నిలిపివేసింది. ఈలోగా స్టే ఉత్తర్వులు పొందకపోతే లొంగిపోయి శిక్ష అనుభవించాలని ఆదేశించింది.