హైదరాబాద్: 28°C
తెలంగాణ

బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి

KMR: బాచన్‌పల్లి (డిప్యూటేషన్‌పై పిప్రి) ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ప్రియాంక (22) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు, నిండు గర్భిణి అయిన ఆమెకు ఈ నెల 23న ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె మగ బిడ్డకు జన్మనివ్వగా, శిశువు ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.