SRCL: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని చందుర్తి మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ చేసిన కృషి, ఆయన సేవలను నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు ఏసుకుమార్, సర్పంచ్ పులి సత్యంగౌడ్, ఉపసర్పంచ్ బత్తుల క్రాంతికుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ
చందుర్తిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు


