MNCL: భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను గురువారం బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ, మాదిగ జాగృతి సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మంచర్ల సదానందం, ఎ. రమేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు పాటుపడతామని తెలిపారు.
తెలంగాణ
ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు


