హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల ధ్రువీకరణ ప్రారంభం

WNP: అగ్రిగోల్డ్‌లో డిపాజిట్లు చేసి నష్టపోయిన బాధితులకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నవంబర్ 25 నుంచి 2027 జూలై 30 వరకు మహబూబ్‌నగర్‌లోని సీఐడీ కార్యాలయంలో బాండ్లు, నగదు రసీదుల ధ్రువీకరణ చేపట్టనున్నారు. 5 జిల్లాల బాధితులకు మండలాల వారీగా పరిశీలన నిర్వహిస్తారు. రోజుకు 250 మందికి ధ్రువీకరణ చేయనున్నట్లు ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు.