BHNG: భువనగిరి పట్టణంలోని బైపాస్ వద్ద ఈరోజు మధ్యాహ్నం ఓ ఇంటికి సంబంధించి గోడను కూల్చివేస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు గోడ కూలి కార్మికుడిపై పడటంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు ఎండీ గుల్జర్ (32) బిహార్‌కు చెందిన వలస కార్మికుడిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
గోడ కూలి వ్యక్తి మృతి


