హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'

JN: దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామ రైతు వేదిక వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ పానుగంటి గిరి గురువారం ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవో భాస్కర్, ఉపసర్పంచ్ సంపత్, సీసీ ఉమా, సీఏ రేఖ, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.