హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్ కమిటీ పదవిపై బేరసారాల ఆరోపణలు

BHNG: ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రూ. 3 కోట్ల బేరసారాలకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గురువారం మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆరోపణలపై ప్రభుత్వం స్పందించి, సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.