హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ బీమాపై అవగాహన

KNR: పేద కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ బీమా భరోసాగా నిలుస్తోందని సైదాపూర్ సర్పంచ్ మునిగంటి స్వప్న అన్నారు. గురువారం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ పథకంపై అవగాహన కల్పించారు. కుటుంబ పెద్ద అకాల మరణం చెందితే బీమా సాయం అందుతుందని వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబం పథకంలో చేరాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నవీన్ పాల్గొన్నారు.