సత్యసాయి: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రశాంతంగా ముగిసింది. పలుచోట్ల స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నప్పటికీ ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఫలితాలు వెలువడనుండటంతో అభ్యర్థులు, గ్రామస్థుల్లో గెలుపోటములపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన పోలింగ్.. ఫలితాలపై ఉత్కంఠ


