హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం సభకు బస్సుల తరలింపు

SRPT: అచ్చంపేటలో సీఎం సభకు సూర్యాపేట డిపో బస్సులను తరలించడంతో నేడు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్టాండ్‌లో బస్సులు లేవంటూ బోర్డు ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అత్యవసర పనులపై వెళ్లేవారు గంటల తరబడి వేచి ఉండగా, పలువురు ప్రయాణాలు వాయిదా వేసుకుని వెనుదిరిగారు. వెంటనే బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.