హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దొంగ ఓట్ల ఆరోపణలు.. పోలీసుల అదుపులో 12 మంది!

కడప జిల్లా సిద్ధవటం మండలం శివునిపల్లిలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన 12 మందిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వీరంతా కడపకు చెందిన వారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి గ్రామానికి వచ్చి ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నిందితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.