ELR: జీలుగుమిల్లి మండలం పి.అంకంపాలెం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలోని ఉంటున్న పోలవరం నిర్వాసితులు సర్పంచ్ ఎన్నికలను పూర్తిగా బహిష్కరించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగినా ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి, కాలనీలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటు ప్యాకేజీ, ఉపాధి కల్పించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించిన పోలవరం నిర్వాసితులు


