హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా కలెక్టరేట్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

తిరుపతి కలెక్టరేట్‌లో గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, డీఆర్‌వో జి. నరసింహులు సమక్షంలో సిబ్బందితో భారత రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వ విలువలను కాపాడాలని జేసీ పిలుపునిచ్చారు.