ELR: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టి.నరసాపురం ఎస్సై ఎం.జయబాబు గురువారం పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. కేంద్రాల్లోకి ఫోన్లను అనుమతించవద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాల్లో ఎస్సై తనిఖీ


