హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పోలింగ్

SKLM: జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఆమదాలవలస మున్సిపాలిటీతో పాటు పలాస డివిజన్‌లోని ఏడు మండలాల్లో పంచాయతీ ఎన్నికలకు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద నిఘా ఉంచారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి కోరారు.