ప్రకాశం: కొండపి మండలం పెళ్లూరులోని 3వ పోలింగ్ బూత్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్యూలైన్లో నిల్చున్న ఓటర్లకు గుర్తులు చూపించడాన్ని టీడీపీ నేతలు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. ఇది ముదిరి టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం దాడులకు దిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కొండపి మండలం పెళ్లూరులో ఉద్రిక్తత


