SKLM: పాఠశాల స్థాయి నుండే విద్యార్థుల్లో రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి బాడాన రాజు అన్నారు. గురువారం పోలాకి మండలం కోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం సాంఘిక శాస్త్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి రాజ్యాంగ ప్రవేశిక చదివి ప్రతిజ్ఞ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'రాజకీయ స్ఫూర్తిని పెంపొందించాలి'


