ప్రకాశం: తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తుమాడు, యు.ఉప్పలపాడు, వెన్నూరు పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ వీ. హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూలైన్లు, పోలింగ్ నిర్వహణ, పోలీస్ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ


