హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మల్లాలమ్మ చెరువులో ఆక్రమణలు..?

అన్నమయ్య: పెద్దమండ్యం మండలం సి. గోళ్లపల్లె గ్రామం మట్లివారిపల్లె సమీపంలోని మల్లాలమ్మ చెరువులో ఆక్రమణలు కలకలం రేపుతున్నాయి. ఆక్రమణలు తొలగించాలని గ్రామస్థులు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. చెరువుకు పడమర వైపున ఉన్న శిఖం భూములను దున్ని పంట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.