హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాజ్యాంగ విలువలను కాపాడాలి'

PDPL: ధర్మారంలో గురువారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను కాపాడాలని సంఘం మండల అధ్యక్షుడు బొల్లి నందయ్య రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు రాకపోవడం శోచనీయమన్నారు.