హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్

బాపట్ల: ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి వెల్లివిరుస్తోంది. నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధుడు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. ఆయన ఇబ్బందిని గమనించిన పోలీస్ కానిస్టేబుల్ కే. సుబ్బారావు, మరో వ్యక్తితో కలిసి వృద్ధుడిని ఆప్యాయంగా చేయి పట్టుకుని పోలింగ్ బూత్‌లోకి తీసుకెళ్లారు. కానిస్టేబుల్‌ను స్థానికులు అభినందించారు.