NTR: పెనుగంచిప్రోలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఊట్ల నాగమణి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే గ్రామంలో బస్టాండ్ నిర్మాణం, శ్మశానవాటిక అభివృద్ధి చేపడతానని హామీ ఇచ్చారు. తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలతో పాటు కోతుల బెడదను పరిష్కరించి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఊట్ల నాగమణి


