హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు..

BHNG: వలిగొండ మండలం నర్సాపురం సమీపంలో గురువారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అడ్డగూడూరుకు చెందిన నర్సింహారెడ్డితో పాటు మహబూబాబాద్ జిల్లాకు చెందిన రాజు, విజయ్ గాయపడ్డారు. స్థానికులు వారికి ప్రథమ చికిత్స అందించారు. ప్రమాదంలో రెండు బైకులు ధ్వంసమయ్యాయి. ఈ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.