SRD: బొల్లారం పారిశ్రామికవాడ నుంచి అమీన్‌పూర్‌కు వెళ్లే రహదారిపై ఏళ్ల తరబడి ఎదురవుతున్న ప్రయాణ కష్టాలకు తెరపడనుంది. ఈ మార్గంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి నిర్మాణం పూర్తయితే పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కార్మికులు, ఉద్యోగులు, వాహనదారుల రాకపోకలకు ఎంతో ఊరట లభించనుంది.
తెలంగాణ
బొల్లారం–అమీన్‌పూర్ సీసీ రోడ్డు పనులు ప్రారంభం


