హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకం

యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 9వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ధనలక్ష్మి మధుకర్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించి ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులు కుమార్, నవీన్ పాల్గొన్నారు.