హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆత్మకూర్‌లో చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ

JGL: గొల్లపల్లి మండలంలోని ఆత్మకూరు గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ పత్రాలను 8 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వీరిలో ఇద్దరు వికలాంగులు, ఒక ఒంటరి మహిళ, ఐదుగురు వితంతువులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజం పోచమ్మ–తిరుపతి యాదవ్, ఉపసర్పంచ్ రాజం భుచ్చవ్వ–లింగయ్య యాదవ్, పంచాయతీ కార్యదర్శి స్రవంతి పాల్గొన్నారు.