హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి పైపులకు పగుళ్లు.. వృథాగా పోతున్న నీరు

KRNL: తుగ్గలిలో ఇప్పటికే తాగునీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు ట్యాంకు పైపులకు పగుళ్లు ఏర్పడి నీరు వృథాగా పోతోంది. పలుచోట్ల లీకేజీలు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైపులకు మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు.