హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదర్శనగర్‌లో రోడ్డుపైనే చెత్త కుప్పలు

HYD: ఆదర్శనగర్ రోడ్ నం.3లో ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై చెత్త కుప్పలు ఉండటంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై BRS నేత గుర్ల తిరుమలేష్ స్పందిస్తూ, CMC అధికారులు వెంటనే చెత్తను తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.