హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి అగ్రిగోల్డ్ బాండ్ల ధ్రువీకరణ

NZB: నేటి నుంచి డిసెంబర్ 30 వరకు అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల ధ్రువీకరణ చేపట్టనున్నట్లు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన 6,808 మంది బాధితులు అసలు బాండ్లు, అవసరమైన పత్రాలతో మండలాల వారీగా నిర్ణయించిన తేదీల్లో నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 8712659823 నంబర్‌ను సంప్రదించాలి.