హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన స్పెషల్ ఆఫీసర్

బాపట్ల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 19, 20 వార్డుల పోలింగ్ కేంద్రాలను ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఆఫీసర్ పద్మావతి, ఆర్డీవో హరికుమార్ పరిశీలించారు. పోలింగ్ ఏర్పాట్లు, భద్రత, ఓటర్ల సౌకర్యాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని కోరారు.