హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువుల్లో అక్రమ తవ్వకాలు.. అధికారుల మౌనం!

నిర్మల్‌ జిల్లాలో చెరువులు, కుంటల్లో మట్టి అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. పొక్లెయిన్లతో తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. నెలకు 4 వేల ట్రిప్పుల వరకు విక్రయిస్తూ కోటి రూపాయలకు పైగా దందా సాగిస్తున్నట్లు అంచనా. భారీ గుంతలతో ప్రమాదాలు పొంచి ఉండటంతో అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.