NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1075.10 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 33.137 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి 661 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో కాకతీయ కాలువకు 100, ఎస్కేప్ ద్వారా 50, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదలవుతుండగా, ఆవిరి రూపంలో 280 క్యూసెక్కుల నీరు తగ్గుతుందని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 33.137 టీఎంసీల నీటి నిల్వ


