BHNG: చౌటుప్పల్ మండలం జైకేసారం, నేలపట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రెండు నెలలుగా కొనడం లేదని రైతులు వాపోయారు. బుధవారం కేంద్రాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి రైతులు తమ గోడు చెప్పుకున్నారు. నెలల తరబడి ధాన్యం రాశులు కేంద్రాల్లోనే ఉన్నాయని, వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
చౌటుప్పల్‌లో కొనని ధాన్యం రాశులు


